శుక్రవారం, 1 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

మీరు కూడా విడాకులిచ్చి మూడు పెళ్ళిళ్లు చేసుకోండి.. పవన్ కళ్యాణ్

pawan kalyan
తాను మూడు పెళ్ళిళ్లు చేసుకున్నానని వైకాపా నేతలు అసూయపడుతున్నారని, వాళ్లు కూడా విడాకులు ఇచ్చి మూడు పెళ్ళిళ్లు చేసుకోవచ్చని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. 
 
విశాఖ వేదికగా వైకాపా నేతలు రాజధాని కోసం గర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో వైకాపా నేతలు ప్రసంగిస్తూ, పవన్ నటన నేర్చుకోవడానికి విశాఖ కావాలి, పెళ్లి చేసుకునే అమ్మాయిని ఇవ్వడానికి విశాఖ కావాలి... కాని రాజధానిగా మాత్రం విశాఖ వద్దా? అంటూ వ్యాఖ్యలు చేశారు. వీటిని ఓ మీడియా ప్రతినిధి దృష్టికి తీసుకొచ్చారు. 
 
ఈ ప్రశ్నకు స్పందించిన పవన్ ఆసక్తికర కామెంట్లు చేశారు. 'నేను 3 పెళ్లిళ్లు చేసుకున్నానని వారు అసూయ పడుతున్నట్లున్నారు. వారినీ 3 పెళ్లిళ్లు చేసుకోమనండి. నాకేమీ అభ్యంతరం లేదు. నాకు కుదరలేకనే 3 పెళ్లిళ్లు చేసుకున్నాను. పొద్దాక తన పెళ్లిళ్లపై మాట్లాడే వారిని చూస్తుంటే... తాను 3 పెళ్లిళ్లు చేసుకున్నానని వారు అసూయ పడుతున్నట్లుగా కనిపిస్తోంది. 
 
వారిని కూడా విడాకులు ఇచ్చి 3 పెళ్లిళ్లు చేసుకోమనండి. నాకేమీ ఇబ్బంది లేదు. అలాగైతే నేను 3 పెళ్లిళ్లు చేసుకున్న చోట 3 రాజధానులు పెడతారా? నేను ముంబైలో నటన నేర్చుకున్నాను. మరి అక్కడ రాజధాని పెడతారా?' అంటూ పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.