బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 అక్టోబరు 2022 (22:06 IST)

ఉత్తరాంధ్ర ప్రజలు తొడగొడితే ఎలా వుంటుందో.. పవన్‌కు తెలియాలి..

rk roja
మూడు రాజధానులకు అనుకూలంగా వైసీపీ నిర్వహించిన విశాఖ గర్జన విజయవంతమైంది. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. షూటింగులకు, కలెక్షన్ల కోసం, ఎన్నికల్లో పోటీ చేయడం కోసం పవన్‌కు విశాఖ కావాలని... కానీ విశాఖ రాజధానిగా మాత్రం వద్దని అన్నారు.

పెయిడ్ ఆర్టిస్టుకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజలు తొడగొడితే ఎలా ఉంటుందో పవన్‌కు చూపించాలని... ఆయనను తరిమికొట్టాలని అన్నారు.

అమరావతి పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు చేసేది రియలెస్టేట్ పోరాటమని అన్నారు. చంద్రబాబుకు 29 గ్రామాల అభివృద్ధే కావాలని చెప్పారు. తాము మూడు ప్రాంతాల అభివృద్ధిని కోరుకుంటున్నామని... తాము చేస్తున్నది ప్రజా పోరాటమన్నారు.

మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేదే జగనన్న సంకల్పమని చెప్పారు. జగన్ సంకల్పానికి ఉత్తరాంధ్ర ప్రజలంతా సంఘీభావం తెలపాలని కోరారు.