సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 అక్టోబరు 2022 (19:38 IST)

భర్త కోసం సింగర్ సునీత సూపర్ ప్లాన్.. ఏంటో తెలుసా?

Sunitha
ప్రముఖ సింగర్ సునీత తన వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోంది. భర్త వీరపనేనిపై తన ప్రేమను వ్యక్తపరిచే దిశగా ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేసింది. సునీత పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా రామ్ దగ్గరుండి చూసుకుంటూ ఆదర్శ తండ్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 
 
అయితే తనకోసం, తన పిల్లల కోసం ఇంత చేస్తున్న రామ్ కోసం సునీత ఏదైనా చేయాలని ఆలోచించింది. ఈ క్రమంలోనే త్వరలోనే తన భర్త రామ్ పుట్టినరోజు వస్తున్న నేపథ్యంలో ఆ రోజు ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వాలని ఆలోచిస్తోందట సునీత. 
 
ఇందులో భాగంగా రామ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన చదువుకున్న స్కూలులో తన పుట్టినరోజు సెలబ్రేట్ చేయడానికి సునీత ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.