సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 అక్టోబరు 2022 (22:21 IST)

అమ్మ అందరికీ అమ్మే.. సరోగసీ అనుకుంటే నాకేంటి సమస్య?: చిన్మయి శ్రీపాద

Chinmayi Sripada
క్యాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమంలో పాలుపంచుకున్న సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే ఈమె.. మహిళలకు ఎదురయ్యే లైంగిక వేధింపులపై గొంతెత్తింది. ఇటీవల ఈమె కవలపిల్లలకు జన్మనిచ్చింది. 
 
కానీ ఆమె సరోగసీ పద్ధతి ద్వారా తల్లి అయ్యిందని నెటిజన్లు ట్రోలింగ్ మొదలెట్టారు. నెటిజన్ల తీరుకు ఓర్చుకోలేని చిన్మయి.. ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్ చేయడం ద్వారా ట్రోల్స్‌కు చెక్ పెట్టింది. సరోగసిపై వస్తున్న ప్రశ్నలకు ఇదే తన సమాధానమని చెప్పుకొచ్చింది. 
 
సరోగసి, ఐవీఎఫ్‌, సహజ గర్భం ఇలా ఏ రూపంలోనైనా పిల్లల్ని కావాలనుకోవడం తనకు పెద్ద విషయం కాదని.. అమ్మ మనుషులకైనా, జంతువులకైనా అమ్మే. తనకు సరోగసి ద్వారా పిల్లలు పుట్టారని ఎవరైనా అనుకుంటే డోంట్ కేర్. ఎవరేమనుకున్నా అది వాళ్ల అభిప్రాయం మాత్రమే.. తనకెలాంటి సమస్యా లేదంటూ సోషల్ మీడియా ద్వారా ట్రోలర్స్‌కు షాకిచ్చే సమాధానం ఇచ్చింది. 
Chinmayi Sripada
Chinmayi Sripada
 
అలాగే తన ఇద్దరి బిడ్డలకు ఫీడింగ్‌ ఇస్తున్న ఫొటోలను షేర్‌ చేసి ప్రపంచంలో అత్యుత్తమమైన ఫీలింగ్‌ ఇదంటూ పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.