గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 ఆగస్టు 2022 (14:46 IST)

హరి హర వీర మల్లు నుంచి లేటెస్ట్ అప్డేట్..

pawan kalyan
'భీమ్లానాయక్‌'తో అభిమానులలో ఫుల్‌ జోష్ నింపాడు పవన్ కళ్యాణ్‌. రానా కీలకపాత్రలో నటించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదలై ఘన విజయం సాధించింది. 
 
ప్రస్తుతం హరి హర వీర మల్లు సినిమా చేస్తున్నాడు.. పవన్. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టంట వైరల్‌గా మారింది.
 
పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా సెప్టెంబర్ 2న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేయనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ గ్లింప్స్‌కు ఓ స్టార్ హీరో వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు టాక్. ఈ వార్తతో పవన్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. 
 
ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏ. దయాకర్ రావు నిర్మిస్తున్నాడు. ఎమ్‌. ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.