గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2022 (12:41 IST)

విష్ణుప్రియ పుట్టినరోజుకు బంగారు కానుక

Siddarth varma, Vishnu Priya
Siddarth varma, Vishnu Priya
బుల్లితెర నటుడు సిద్ధార్థ వర్మ గురించి పరిచయం అవసరం లేదు. సిద్ధార్థ వర్మ బుల్లితెర నటి విష్ణు ప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈమె జానకి కలగనలేదు సీరియల్‌లో మల్లిక పాత్రలో పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు. 
 
ఇకపోతే ఒకవైపు సీరియల్స్‌లో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులను సందడి చేస్తున్నటువంటి విష్ణు ప్రియ తాజాగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా నా బర్త్ డేకి మా ఆయన బంగారు కానుక అంటూ ఒక వీడియోని విడుదల చేశారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
ఈ వీడియోలో భాగంగా విష్ణు ప్రియ తన పుట్టినరోజు సందర్భంగా తన భర్తను గోల్డ్ షాప్‌కి తీసుకువెళ్లి తనకు నచ్చిన బంగారు నగలను కొనుగోలు చేసి తన భర్త చేత బిల్లు కట్టించింది. 
 
ఈ క్రమంలోనే బంగారు నగలు కొనడానికి వెళ్లిన ఈమె తనకు నచ్చిన గాజులు నెక్లెస్ ఇయర్ రింగ్స్ వంటి వాటిని కొని ఇక బిల్లు మాత్రం సిద్ధార్థ వర్మ చేత కట్టించారు. ఈ వీడియోని విష్ణు ప్రియ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.