సోమవారం, 9 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 ఆగస్టు 2022 (21:59 IST)

చిరంజీవితో ముఠామేస్త్రి చేసిన జ్ఞాపకాలు మరిచిపోలేనివి.. రోజా

Rojaselvamani
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా సినీ నటి, వైకాపా నేత రోజా విషెస్ చెప్పారు. తాను ఇప్పుడు పాలిటిక్స్‌లో ప్రస్తుతం బిజీగా ఉన్నానని, చాలామంది సినిమాలు చేయాలని అడుగుతున్నారు. కానీ టైమ్ లేక చేయడం లేదని చెప్పిన రోజా.. చిరంజీవి అడిగితే తప్పకుండా ఆయన సినిమాలో నటిస్తానని తన మనసులో మాట బయటకు తెలిపారు.
 
చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు బెస్ట్ విషెష్ అందజేసి..ఆయనతో కలిసి నటించిన 'ముఠా మేస్త్రీ' చిత్ర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చిరంజీవికి బర్త్ డే విషెస్ తెలిపిన అనంతరం ..తను స్కూల్ డేస్ నుంచి చిరంజీవి అభిమానినని పేర్కొంది. 
 
'ఆలయ శిఖరం' సినిమా షూటింగ్ టైమ్‌లో ఆయన వద్దకు వెళ్లి ఆటోగ్రాఫ్ తీసుకున్న విషయాన్నీ గుర్తు చేసుకుంది. తనకు 'ఘరానా మొగుడు' సినిమాలో అవకాశం వచ్చి మిస్ అయిందని, ఆ తర్వాత 'ముఠా మేస్ట్రీ'లో మెయిన్ హీరోయిన్ గానటించే ఛాన్స్ దక్కిందన్నారు. 
 
ఇక ఆ సినిమాలో చిరంజీవి డ్యాన్స్ చాలా బాగా చేశారని తెలిపిన రోజా.. షూటింగ్‌లో ఫస్ట్ ఫస్టే 'ఎంత ఘాటు ప్రేమయో' సాంగ్ షూట్ చేశారని గుర్తు చేసుకున్నారు.