ఆర్కే రోజా కుమార్తె తెరంగేట్రానికి రంగం సిద్ధం.. ఓ స్టార్ హీరోతో..?
సినీ నటి, వైకాపా నేత ఆర్కే రోజా కుమార్తె తెరంగేట్రానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రోజా నట వారసత్వాన్ని కొనసాగిస్తూ అన్షుమాలిక త్వరలోనే సినిమాల్లోకి రానుందట. ఓ స్టార్ హీరో తనయుడితో ఆమె తెరంగేట్రం చేసేందుకు రంగం సిద్ధమైందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే అమెరికాలో ఫేమస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో అన్షుకు సీటు కూడా వచ్చింది. త్వరలోనే ఆమె అక్కడ చేరనుంది. అక్కడ నుంచి రాగానే వరుసగా సినిమాల్లో నటించడానికి అన్షుమాలిక సన్నద్ధం అవుతుందట.
అన్షు మాలిక ఇటీవల అరుదైన గౌరవం దక్కించుకున్నసంగతి తెలిసిందే. ప్రఖ్యాత ఇన్ఫ్లూఎన్సర్-యూకే మ్యాగజైన్ కవర్ పేజీపై అన్షు ఫొటోను ప్రచురించారు. అన్షు రచయితగా, ఎంట్రప్రెన్యుయర్‌గా, ప్రోగ్రామర్‌గా సమాజం కోసం పాటుపడుతున్నందుకు యంగ్ సూపర్ స్టార్ అవార్డుకు ఎంపికైందని ఇన్ఫ్లూఎన్సర్ ప్రకటించింది.