1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 ఆగస్టు 2022 (16:43 IST)

అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీ... బీజేపీ గాలం వేస్తుందా?

ntr - amit shah
బీజేపీ అగ్రనేత అమిత్ షాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలవడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ అంటేనే టీడీపీ అనేది టక్కున చెప్పేశారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఉన్నట్టుండి.. బీజేపీ అగ్రనేతను కలవడం చర్చనీయాంశమైంది. 
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌ రాజకీయ యాత్ర కూడా చేశాడు. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. అలాంటి ఎన్టీఆర్‌ తనకు తాను అమిత్‌ షాను కలవడం ఏంటి అనే మాట చర్చగా మారింది. ఆదివారం మొత్తం ఈ చర్చే నడిచింది. అయితే బీజేపీ నాయకత్వమే ఎన్టీఆర్‌ను పిలిచింది అనే టాక్‌ కూడా నడిచింది. 
 
అనుకున్నట్టుగా ఆదివారం రాత్రి 8 గంటలకు అమిత్ షాను ఎన్టీఆర్ కలుసుకున్నారు. హైదరాబాదులోని పెద్ద హోటల్‌లో వీరిద్దరి భేటీ జరిగింది. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారట. ఆ తర్వాత ఇద్దరూ కలసి భోజనం కూడా చేశారు. ఎందుకు కలిశారు, ఏం మాట్లాడారు అనే విషయంలో ఎక్కడా సమాచారం లేదు. 
 
అయితే 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో ఎన్టీఆర్‌ నటనను చూసి మురిసిపోయిన అమిత్‌ షా పిలిపించి మాట్లాడారు అంటూ ఓ మాట వినిపిస్తోంది. ఆ విషయం పక్కనపెడితే.. త్వరలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్టీఆర్‌ వర్గానికి చెందిన వారిని తమ వైపు తిప్పుకునేందుకు అమిత్‌ షా కలిశారని చెప్తున్నారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో కలవడానికి టీడీపీ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఎన్టీఆర్‌ను అమిత్‌ షా కలవడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.