శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 21 ఆగస్టు 2022 (11:02 IST)

తిరుపతి పర్యటనలో జనసేనాని

Pawan kalyan
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుమల పర్యటన చేపట్టారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయాన్ని చేరుకుంటారు. అక్కడి నుంచి ర్యాలీగా తిరుపతికి వెళ్తారు. 
 
నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో సమావేశమవుతారు. అనంతరం తిరుమలకు బయలదేరనున్న జనసేనాని.... సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.
 
తిరుపతిలో పది గంటల నుంచి పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమంలో పాల్గొంటారు. తిరుపతిలోని జిఆర్ఆర్ కన్వెన్షన్ హాలులో జనవాణి కార్యక్రమం జరగనుంది. జనవాణి కార్యక్రమంలో... ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి సమస్యలపై వినతులను పవన్ కల్యాణ్ స్వీకరిస్తారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల ప్రజలు ఈ జనవాణి కార్యక్రమానికి రావచ్చని జనసేన పార్టీ తెలిపింది.