ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

నేడు కడప జిల్లా పర్యటనకు పవన్ కళ్యాణ్ - సిద్ధవటంలో రచ్చబండ

pawan kalyan - siddavatam
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శనివారం కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సిద్ధవటంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులను ఆదుకునేలా ప్రవేశపెట్టిన జనసేన ఆసరా పథకం కింద లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయనున్నారు. ఈ చెక్కులను పవన్ కళ్యాణ్ బాధితులకు స్వయంగా అందజేయనున్నారు. 
 
కాగా, ఏపీలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలిచే ఉద్దేశ్యంతో కౌలు రైతు భరోసా యాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెల్సిందే. ఈ యాత్రలో భాగంగా, ఆయన శనివారం జిల్లాలోని సిద్ధవటం పర్యటనకు వెళ్లనున్నారు.