ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 ఆగస్టు 2022 (10:13 IST)

ఎమ్మెల్యేలు, ఎంపీలను ట్రాక్ చేయాలి... యాప్ సిద్ధం.. పవన్ ట్వీట్ వైరల్

Pawan Tweet
Pawan Tweet
ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారో ట్రాక్ చేసేలా పౌరులు కొత్త యాప్ సిద్ధం చేస్తారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. బాధ్యత ఎప్పుడూ ఒకరికే వుండకూడదు.. అది అందరికీ వుండాలని పవన్ అన్నారు.
 
ఉపాధ్యాయుల జవాబుదారీతనంతో వ్యవహరించేలా ఒక యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని వైకాపా ప్రభుత్వం చెబుతోంది. పాఠశాలకు రాగానే అందులో హాజరు నమోదు చేసుకోవాలని ఉపాధ్యాయులను సర్కారు ఒత్తిడి చేస్తోంది. అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా ఇలాంటి తరహా యాప్‌ను పౌరులు సిద్ధం చేయాలని ట్విట్టర్ ద్వారా పవన్ తెలిపారు. 
 
ట్విట్టర్ వేదికగా ఓ కార్టూన్ కూడా జోడించారు. ఉపాధ్యాయులంతా యాప్ సిగ్నల్ కోసం అటూ ఇటూ తిరుగుతున్నట్లు ఆ కార్టూన్‌లో వుంది. పవన్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.