1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 జులై 2022 (12:22 IST)

రాష్ట్రపతి ఎన్నికలు.. ద్రౌపది ముర్ముతో వైసీపీ ఎమ్మెల్యేల భేటీ

draupadi murmu
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు మద్దతివ్వాలని ఇప్పటికే  టీడీపీ నిర్ణయం తీసుకుంది. సోమవారం నాడు జరిగిన టీడీపీ స్ట్రాటజీ కమిటీ సమావేశంలో  ఈ నిర్ణయం తీసుకుంది.  రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము బరిలో దిగింది. 
 
విపక్ష పార్టీల తరపున మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ కూడా ద్రౌపది ముర్ముకు మద్దతును ప్రకటించింది. 
 
ద్రౌపది ముర్ము నామినేషన్ కార్యక్రమంలో ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా పాల్గొన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష పార్టీల తరపున  యశ్వంత్ సిన్హాను బరిలోకి దింపారు. 
 
ఏపీ రాష్ట్రంలో వైసీపీకి 151 ఎమ్మెల్యేలు,  పార్లమెంట్ లో 22 ఎంపీల బలం ఉంది. రాష్ట్రపతి ఎన్నికల కోసం ఏర్పాటు చేసే ఎలక్టోరల్ కాలేజీలో వైఎస్ఆర్‌సీపీకి ఉన్న ఓట్ల విలువ 43,674 గా ఉంది. ఎలక్టోరల్ కాలేజీలో వైఎస్ఆర్‌సీపీ ఓట్ షేర్  విలువ 4 శాతంగా ఉంది. 
 
టీడీపీకి ఏపీ అసెంబ్లీలో 23 మంది ఎమ్మెల్యేలు, పార్లమెంట్‌లో ముగ్గురు ఎంపీలున్నారు. అయితే కొందరు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్‌సీపీకి మద్దతు పలికారు. ఈ ఎన్నికల్లో పార్టీ విప్  కూడా చెల్లదు. వైఎస్ఆర్‌సీకి మద్దతు నిలిచిన అభ్యర్ధులు కూడా ఎన్డీఏ అభ్యర్ధికే మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. ఇందులో భాగంగా వైకాపా ఎమ్మెల్యేలతో ద్రౌపది ముర్ము భేటీ అయ్యే ఛాన్సుంది.