మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 17 ఆగస్టు 2022 (12:53 IST)

Pawan Kalyan: కడపలో పర్యటించనున్న జనసేనాని పవన్ కళ్యాణ్

pawan kalyan
ఒక్కసారి జనసేన వైపు చూడండి అని పిలుపునిచ్చిన జనసేన అధినేత ఆగస్టు 20న సీఎం జగన్ ఇలాకాలో పర్యటించనున్నారు. ఆగస్టు 20న ఉమ్మడిజిల్లాలో పర్యటించనున్నారు పవన్. పంట నష్టాలతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు రూ. 1 లక్ష ఆర్థిక సాయం చేస్తున్నారు.

 
రాజంపేట నియోజకవర్గంలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని రైతుల కష్టాలను తెలుసుకోనున్నారు. అనంతరం కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు. కాగా ఇప్పటికే తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటించారు. అక్కడ కూడా రైతులకు ఆర్థిక సాయం అందించారు.