శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 9 ఆగస్టు 2022 (17:34 IST)

మహేష్ బాబుకు మ‌ద్ద‌తుగా నిలిచా- ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

Mahesh Babu, Pawan Kalyan
Mahesh Babu, Pawan Kalyan
ప్రముఖ కథానాయకులు మహేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియ‌జేశారు ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్. మంగ‌ళ‌వారంనాడు ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఓ లెట‌ర్‌ను ఆయ‌న పోస్ట్ చేశారు. 
 
మహేష్ బాబు తనదైన శైలి నటనతో నవతరం ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఆయన చేపట్టే సేవా కార్యక్రమాలు… హృద్రోగంతో బాధపడే చిన్నారులకు శస్త్ర చికిత్సలు చేయించడం అభినందనీయం. శ్రీ కృష్ణ గారి నట వారసత్వాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ.. తండ్రి బాటలోనే దర్శకులకు, నిర్మాతలకు అండగా నిలుస్తున్నారు. 
 
‘అర్జున్’ సినిమా సందర్భంలో పైరసీపై పోరాటానికి శ్రీ మహేష్ బాబు గారు తన గళం వినిపిస్తే ఆయనకు మద్దతుగా నిలిచాను. పరిశ్రమను కాపాడుకొనేందుకు ఆయన ముందుకు రావడంతో అందరం వెన్నంటి నిలిచాం. ‘జల్సా’ సినిమాలో సంజయ్ సాహూ పాత్రను పరిచయం చేసేందుకు శ్రీ మహేష్ బాబు గారి నేపథ్య గాత్రం అయితే బాగుంటుందని, దర్శకులు శ్రీ త్రివిక్రమ్ గారు కోరగానే అంగీకరించిన సహృదయత శ్రీ మహేష్ బాబు గారిది. కథానాయకుడిగా తనదైన పంథాలో వెళ్తూ ప్రేక్షకుల మెప్పు, పురస్కారాలూ అందుకొంటున్న శ్రీ మహేష్ బాబు గారు మరిన్ని విజయాలు అందుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.