ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 ఆగస్టు 2022 (19:43 IST)

సితారతో మహేష్ బాబు వాకింగ్.. వైరల్ ఫోటో

Mahesh Babu_Sitara
Mahesh Babu_Sitara
సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కేజీఎఫ్ స్టార్ యశ్ సైతం ఫారిన్, యూరప్, ఆఫ్రికా వంటి దేశాల్లో కుటుంబంతో సరదాగా గడిపిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. 
 
ప్రస్తుతం సౌత్ స్టార్స్ తమ రాబోయే సినిమాల కోసం సిద్ధంగా ఉన్నారు. తాజాగా ఓ స్టార్ హీరో తన కూతురితో కలిసి సరదాగా వాకింగ్ చేస్తున్న ఫోటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
 
సరదాగా కూతురితో ముచ్చటిస్తూ వాకింగ్ చేస్తున్న ఈ హీరోకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా యూత్‏లో అభిమానులు ఎక్కువే.
 
కేవలం హీరో మాత్రమే కాదు.. ఆయన గారాలపట్టికి కూడా నెట్టింట యమ క్రేజ్ ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు. తన కూతురు సితార. ఇటీవల సర్కారు వారి పాట హిట్ తర్వాత ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ వెళ్లిన సంగతి తెలిసిందే. 
 
అందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ప్రస్తుతం మహేష్.. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోయే ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాడు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ నెల చివరలో ఈ మూవీ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.