తెలుగు హీరోలు చాలా స్పెషల్ అంటున్న హీరోయిన్
మలయాళ నటి సంయుక్తా మీనన్ ఒకేరోజు రెండు సినిమాలకు సైన్ చేసింది. కరోనా టైంలోనే ఆమె భీమ్లానాయక్, బింబిసార్ చిత్రాలకు సైన్ చేయడం విది నాపై చూపిన కరుణ అని పేర్కొంది. భీమ్లానాయక్‌లో పవన్ కళ్యాణ్‌కు చెల్లెలుగా నటించి మెప్పించింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్‌ను చాలా విషయాలు తెలుసుకున్నాననీ, ఆయన చూపే రెస్పెక్ట్ మర్చిపోలేనిది అన్నారు.
కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన బింబిసార మూవీలో రెండో కళ్యాణ్‌రామ్‌కు హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఇతర హీరోల గురించి పలు విషయాలు తెలిపింది. కళ్యాణ్‌రామ్‌లో కొత్తగా ఏదో చేయాలనే తపన గ్రహించానంది. తప్పకుండా బింబిసార మంచి విజయం అందుకుంటుందని అన్నారు.
ఇటీవల బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తారక్ తో మాట్లాడానని, ఆయన నటనా ప్రావిణ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే అని అన్నారు. మహేష్ బాబు గురించి మాట్లాడుతూ, మహేష్ ఎల్లప్పుడూ ప్రకాశించే రాక్ స్టార్ వంటి వారని, ఆయన ప్రక్కన మూవీ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు ఆమె చెప్పారు. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్‌లో నేను నటిస్తున్నట్లు వస్తున్న వార్తలో నిజంలేదని. అదే నిజమైతే అదృష్టవంతురాలు అవుతానన్నారు.