మహేష్‌బాబు హైదరాబాద్ వచ్చేశాడోచ్  
                                       
                  
                  				  Mahesh, Narmada at airport
మ.మ..మహేషా..అన్నట్లుగానే..  మహేష్ బాబు హైదరాబాద్‌కు వచ్చేశారు. ఇప్పటివరకు వెకేషన్ నిమిత్తం విదేశాలకు వెళ్ళిన మహేస్, నమ్రత శిరోద్కర్, గౌతమ్, సితార నలుగురు ఈరోజు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌లో లాండ్ అయ్యారు. ఒక్కొక్కరు విడివిడిగా ఎస్కలేటర్ దిగుతూ కనిపించారు ఈ ఫొటోలను నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
 				  											
																													
									  
	 
				  
				  మహేష్‌బాబు ఫ్యామిలీ మాస్క్‌లు ధరించి ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వచ్చేవరకు వారిని అక్కడివారు గుర్తుపట్టలేదు. అయితే కారు దగ్గరకు రాగానే అభిమానులు కొంతమంది వచ్చి విషెస్ చెప్పడంతో మహేష్ వెంటనే చేయి ఊపి కారెక్కి వెళ్ళిపోయారు.
 				  
	 
	ఆగస్టు 9వ తేదీన మహేష్‌బాబు పుట్టినరోజు కావడంతో ఆరోజు ఆయన అభిమానులకు అందుబాటులో వుండనున్నట్లు తెలుస్తోంది. అదేరోజు SSMB28 ప్రాజెక్ట్‌లో షూటింగ్‌లో పాల్గొననున్నారు.