1980 నాటి కథతో నేను c/o నువ్వు
Kolli Ramakrishna and others
ముఖ్య అతిధులుగా విచ్చేసిన ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ కొల్లి రామకృష్ణ మాట్లాడుతూ.. నాకు ఈ చిత్ర దర్శకుడు సాగా పది సంవత్సరాల నుండి తెలుసు . సినిమా రంగంపై ఎంతో ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీ కి వచ్చాడు. ఇది సాగా కు రెండో చిత్రం. ఈ సినిమా కోసం తానే దగ్గరుండి కథాల, స్క్రీన్ ప్లే దర్శకత్వం అన్నీ తన బుజాలమీద వేసుకుని ఈ చిత్రాన్ని ముందుకు తీసుకువెళ్లాడు.. ఈ చిత్రంలో ఉన్న ఫైట్స్, మ్యూజిక్ చాలా బాగావచ్చాయి .ఈ చిత్ర యూనిట్ కు అల్ ధ బెస్ట్ అన్నారు.
చిత్ర దర్శకుడు సాగా రెడ్డి తుమ్మ మాట్లాడుతూ.. 1980 లో నా చిన్న తనంలో నేను దగ్గరగా చూసిన కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాను. ఈ చిత్రానికి పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్, పాటల రచయిత తో పాటు మొత్తం టెక్నిసియన్స్ అందరూ నాకు మంచి స్నేహితులు. అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. చిన్న సినిమాలను దయచేసి సపోర్ట్ చేయండి.సెప్టెంబర్ 9 న ప్రపంచ వ్యాప్తం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.
సహ నిర్మాత జోషఫ్ మాట్లాడుతూ.. నాకు దర్శకుడు సాగా కథ చెప్పగానే నచ్చి ఈ ప్రాజెక్ట్ లొకి వచ్చాను. సాగా ఎంతో విజనరీ ఉన్న డైరెక్టర్. పోస్టర్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఓ వైపు వివాహ శుభకార్యాన్ని చూపిస్తూ , మరోవైపు సంకెళ్ళ తో కాళ్ళను బందించిన ఒక చిన్న క్రైమ్ స్టోరీ లా క్రియేట్ అయ్యేలా పోస్టర్ కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే కథ డిఫరెంట్ గా ఉంటుందని అర్థం అవుతుంది.ఈ సినిమా చూశాను విడుదల కోసం ఎంతో ఆత్రుత గా ఎదురుచూస్తూ న్నాను ఉన్నాను. సెప్టెంబర్ 9 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.
తర్వాతి కథనం
