పవన్ ఛాలెంజ్‌పై స్పందించిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి
చేనేత దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఎస్సార్ నాయకులు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌కు ఛాలెంజ్ విరిరారు. బాలినేనితో పాటు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్‌లకు పవన్ కల్యాణ్ ఈ ఛాలెంజ్ విసిరారు.
ఈ మేరకు ఆదివారం ట్విట్ చేసిన పవన్.. చంద్రబాబు, బాలినేని, లక్ష్మణ్‌లకు ట్యాగ్ చేస్తూ చేనేత దుస్తులు ధరించి ఫోటోలు దిగాలని కోరారు. పవన్ ఛాలెంజ్‌పై బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. చేనేత దుస్తులు ధరించి దిగిన ఫోటోను ట్విట్టర్‌లో పంచుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఛాలెంజ్‌ను స్వీకరించానని తెలిపారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో చేనేత మంత్రిగా పనిచేశానని తెలిపారు. నాడు వైఎస్‌ఆర్ చేతి వృత్తులకు మూడు వందల కోట్ల రూపాయల రుణమాఫీ చేసి చిత్తశుద్ధితో పనిచేశామన్నారు.