ప్రధాని మోదీతో ఏకాంతంగా చంద్రబాబు 5 నిమిషాల చర్చ, ఏంటి సంగతి?
2019 ఎన్నికల తర్వాత ఇంతవరకూ ముఖాముఖిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు సమావేశం అవ్వడం జరగలేదు. అలాంటిది శనివారం నాడు తెదేపా అధినేత ప్రధాని మోదీతో 5 నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ఏ విషయాలు చర్చించుకున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
కాగా ఏపీలో వచ్చే ఎన్నికల్లో భాజపా-జనసేన-తెదేపా మధ్య పొత్తు వుంటుందనే ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో చంద్రబాబు భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలావుంటే ఏపీకి నిధులు ఇవ్వడంపై ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షులు కీలక వ్యాఖ్యలు చేసారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికుడు కావడం వల్ల కేంద్రం నిధులను ఇచ్చిందనీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేనందువల్ల జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇవ్వాలంటే అనుమానించాల్సి వస్తుందంటూ తెలిపారు.
మొత్తమ్మీద భాజపా-తెదేపా-జనసేన బంధం బాగా గట్టిపడేట్లు కనబడుతోంది. మరి వచ్చే ఎన్నికల్లో ఈ కూటమి పాలక పార్టీ వైసిపిని ఎంతమాత్రం దెబ్బకొడుతుందో చూడాల్సి వుంది.