మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 జులై 2022 (10:29 IST)

పోలవరం విలీన మండలాల్లో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన

chandrababu
పోలవరం విలీన మండలాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నుంచి పర్యటించనున్నారు. ఆయన నేటి నుంచి రెండు రోజుల పాటు పర్యటిస్తారు. ఇటీవల తెలంగాణాలో కురిసిన భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగింది. 
 
దీంతో కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలోని అనేక గ్రామాలు నీట మునిగాయి. ముఖ్యంగా పోలవరం విలీన మండలాలు పూర్తిగా మునిగిపోయాయి. ఈ ప్రాంతాల్లో ఆయన రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ముఖ్యంగా, భద్రాద్రి జిల్లాలో బూర్గంపహాడ్ ముంపు ప్రాంతాల్లోని బాధితులను కూడా చంద్రబాబు పరామర్శించనున్నారు. 
 
ఇందుకోసం ఆయన గురువారం ఉదయం 8 గంటలకు ఉండవల్లిలోని నివాసం నుంచి చంద్రబాబు బయలుదేరి వెళ్తారు. వేలేరుపాడు, కుక్కనూరు మండలాల్లో బాధితులను పరామర్శిస్తారు. ఆ తర్వాత తెలంగాణాలోని భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ ముంపు ప్రాంతాల్లోని బాధితుల చెంతకు వెళ్లి వారిని పరామర్శిస్తారు. తొలిరోజు పర్యటన తర్వాత చంద్రబాబు భద్రాద్రిలోనే బస చేస్తారు. శుక్రవారం ఎటపాక, కూనవరం, వీఆర్ పురం మండలాల్లోని తోటపల్లి, కోతుగట్ట, కూనవరం, రేఖపల్లి ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన సాగుతుంది.