1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 జులై 2022 (13:44 IST)

ఉభయగోదావరి ముంపు గ్రామాల్లో చంద్రబాబు పర్యటన

chandrababu
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఉభయ గోదావరి జిల్లాల్లోని ముంపు గ్రామాల్లో పర్యటించనున్నారు. కోనసీమ జిల్లాతో పాటు ఈ జిల్లాకు సరిహద్దులో ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ముంపునకు గురైన లంక గ్రామాల్లో సిద్ధాంతం నుంచి కరుగోరు మిల్లు చేరుకొని అక్కడ నుంచి గోదావరి మధ్యలో ఉన్న అయోధ్య లంకకు వెళ్లనున్నారు.
 
ఆ తర్వాత రోడ్డు మార్గంలో మానేపల్లి పాలానికి వెళ్తారు. అక్కడ గోదావరిలో ఇద్దరి బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం అప్పనపల్లి చేరుకోనున్నారు. అప్పనపల్లిలో వరద బాధిత కుటుంబాలను పరామర్శించి... రోడ్డు మార్గంలో రాజోలు వెళ్లి ఇక్కడ నుంచి రాత్రి 7 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు చేరుకుంటారు.
 
శుక్రవారం యలమంచిలి మండలంలో చంద్రబాబు పర్యటిస్తారు. దొడ్డిబట్ల, అబ్బిరాజుపాలెం, గంగాధరపాలెం, లక్ష్మీపురంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు. నరసాపురం పరిధి పొన్నపల్లిలో చంద్రబాబు పర్యటన ముగియనున్నట్లు తెలిపారు.