సాయి భక్తులకు శుభవార్త.. షిర్డీకి 4 రోజుల టూర్ ప్యాకేజీ
సాయి భక్తులకు శుభవార్త. ఐఆర్‌సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి షిర్డీకి టూర్ ప్యాకేజీ ప్రకటించింది. సాయి శివం పేరుతో ఈ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. రైలులో సాయి భక్తుల్ని తీసుకెళ్లి షిర్డీలో సాయి బాబా ఆలయాన్ని చూపించనుంది. https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
సమీపంలోని నాసిక్, త్రయంబకేశ్వర్ ప్రాంతాలు కూడా ఈ టూర్ ప్యాకేజీలో కవర్ అవుతాయి. 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. హైదరాబాద్ నుంచి ప్రతీ శుక్రవారం ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
వీకెండ్‌లో షిరిడీ టూర్ ప్లాన్ చేసుకునేవారికి ఈ టూర్ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. ఈ టూర్ ప్రతీ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. టూరిస్టులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సాయంత్రం 6.50 గంటలు అజంతా ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి.
రెండో రోజు ఉదయం 7.10 గంటలకు నాగర్‌సోల్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడి నుంచి షిరిడీ బయల్దేరాలి. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత షిరిడీ ఆలయ సందర్శన ఉంటుంది. సాయంత్రం ఖాళీ సమయం ఉంటుంది. రాత్రికి షిరిడీలో బస చేయాలి.
మూడో రోజు ఉదయం నాసిక్ బయల్దేరాలి. త్రయంబకేశ్వరం, పంచవటి సందర్శించాలి. రాత్రి 9.20 గంటలకు నాగర్‌సోల్ స్టేషన్‌లో రైలు ఎక్కితే మరుసటి రోజు ఉదయం సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
టూర్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ లేదా థర్డ్ ఏసీ ప్రయాణం, ఒక బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్, సైట్ సీయింగ్ కవర్ అవుతాయి. లంచ్, డిన్నర్, రైలులో భోజనం, ఎంట్రెన్స్ టికెట్స్ కవర్ కావు.