గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 జులై 2022 (13:01 IST)

ఈ నెల 25, 26 తేదీల్లో కోనసీమ జిల్లాల్లో సీఎం పర్యటన

ఉభయగోదావరి జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ నెల 25, 26వ తేదీల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన వరద బాధితులను పరామర్శిస్తారు. రాజోలు మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన సాగనుంది. 
 
ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు జిల్లా యంత్రాంగం సీఎం పర్యటనకు కోసం ఏర్పాట్లు చేస్తుంది. పి.గన్నవరం నియోజకవర్గంలోని బూరుగులంక, ఊడిమూడిలంక, అరిగెలవారి పేట, జి.పెదపూడి లంక గ్రామాల్లో ఆయన పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేసే అవకాశం ఉంది. 
 
కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఎమ్మెల్యే కొండేటి చిట్టబాబు ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఏర్పాట్లు చేస్తున్నారు.