సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 2 ఆగస్టు 2022 (20:25 IST)

ఉమామహేశ్వరి మరణం బాధాకరం- తలసాని శ్రీనివాస్

Talasani at umameshwari house
Talasani at umameshwari house
దివంగ‌త ఎన్‌.టి.ఆర్‌. చివ‌రి కుమార్తె ఉమామహేశ్వరి మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంతో ఉస్మానియా ఆసుప‌త్రికి త‌ర‌లించి తిరిగి భౌతిక దేహాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంకు మంగ‌ళ‌వారంనాడు త‌ర‌లించారు. ఈ సంద‌ర్భంగా చిత్ర‌రంగంలోని ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు ఆమెకు నివాళుల‌ర్పించారు.
 
Talasani, nara lokesh
Talasani, nara lokesh
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  నేడు జూబ్లీహిల్స్ లోని నివాసంలో ఉమామహేశ్వరి పార్దీవదేహం పై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ, ఉమా మహేశ్వరి అంటే నందమూరి తారకరామారావు గారికి అధిక ప్రేమ అని తెలిపారు. ఉమా మహేశ్వరి మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ ఆమె కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్తిస్తున్నాన‌ని తెలిపారు.