1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Minister Nadendla helps accident victims

మానవత్వం చాటుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ (Video)

nadendla manohar
జనసేన పార్టీ సీనియర్ నేత, ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ మరోమారు మానవత్వం చాటుకున్నారు. ఏలూరు జిల్లా భీమడోలు వద్ద ఓ ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకర్ గాయపడ్డారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న మంత్రి నాదెండ్ల మనోహర్.. రోడ్డు ప్రమాదాన్ని చూసి తన కాన్వాయ్‌ను ఆపాడు. 
 
ఆ తర్వాత తానే స్వయంగా అంబులెన్స్‌కు ఫోన్ చేసి గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. పిమ్మట జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి క్షతగాత్రుడుకి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. గతంలో కూడా ఇదేవిధంగా ఓ రోడ్డు ప్రమాద బాధితుడుకి ప్రథమ చికిత్స చేయడమేకాకుండా ఆస్పత్రికి తరలించిన విషయం తెల్సిందే. 

 
తర్వాతి కథనం
పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తున్న బలూచిస్థాన్ - ఇటు భారత్ కూడా..