మానవత్వం చాటుకున్న మంత్రి మనోహర్... యువకుడికి ప్రాథమిక చికిత్స
ఏపీ మంత్రి, జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడుకి రక్తస్రావం కాకుండా ప్రథమిక చికిత్స చేశారు. ఈ సంఘటన విజయవాడ ప్రకాశం బ్యారేజీపై కనిపించింది. ఈ వంతెనపై రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ యుకుడు తలకు దెబ్బతగిలింది. రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలుసుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ వెంటనే తన వాహనం ఆపి సిబ్బంది సాయంతో ఆ యువకుడికి ప్రథమ చికిత్స చేశారు. తల నుంచి రక్తస్రావం కాకుండా ఆపారు.
108కు ఫోన్ చేసి అంబులెన్స్ రప్పించి, క్షతగాత్రుడుని ఆస్పత్రికి తరలించారు. ఆ యువకుడు 108 అంబులెన్స్‌లో ఎక్కించుకుని వెళ్లేంత వరకు అక్కడే ఉన్నారు. పైగా, అతనికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని అంబులెన్స్ సిబ్బందికి నాదెండ్ల సూచించారు. ఆ యువకుడుని విజయవాడలోని హెల్ప్ ఆస్పత్రిలో చేర్చుతున్నట్టు 108 సిబ్బంది సమాచారం ఇచ్చారు.
కాగా, ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలతో ఎంతో బిజీగా గడిపే మంత్రి మనోహర్.. రోడ్డుపై జరిగిన ప్రమాదా్ని చూసి కారు ఆపడం, క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించే వరకు అక్కడే ఉండటాన్ని చూసిన ప్రతి ఒక్కరూ మంత్రిని ప్రశంసిస్తున్నారు.