సంబంధిత వార్తలు
అమిత వేగంతో వచ్చి లారీని ఢీకొట్టిన కారు - ఇద్దరు మృతి (Video)
తెలంగాణ రాష్ట్రంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు ఒకటి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళతో పాటు చిన్నారి కూడా మృత్యువాతపడ్డారు. ఈ ఘటన వరంగల్ - హైదరాబాద్ జాతీయ రహదారి రాయగిరి సమీపంలో జరిగింది. లారీని కారు అతివేగంతో వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మహిళతో పాటు చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
మృతులు మహబూబాబాద్ జిల్లా కె.సముద్రంకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదం ధాటికి లారీ వెనుక భాగంగా కారు ఇరుక్కుపోయింది. ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో కారులోని మృతదేహాలను వెలికి తీశారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. డ్రైవర్ అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెత్
— BIG TV Breaking News (@bigtvtelugu) January 16, 2025
వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారి రాయగిరి సమీపంలో ప్రమాదం
లారీని అతివేగంతో ఢీ కొట్టిన కారు
యాక్సిడెంట్ లో ఓ మహిళతో పాటు చిన్నారి మృతి
మృతులు మహబూబాబాద్ జిల్లా కే సముద్రంకు చెందిన వారిగా గుర్తింపు
లారీ వెనుక భాగంగా ఇరుక్కుపోయిన కారు… pic.twitter.com/0K0MMws7yx
తర్వాతి కథనం
