తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత... దీనికి తోడు వర్షాలు.. ఐఎండీ వార్నింగ్
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. దీంతో పాటు కన్యాకుమారి సమీపంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించింది. ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో ఇవాళ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది.
ఇక ప్రకాశం చిత్తూరు నెల్లూరులో కూడా వర్షాలు కురిసాయి. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతుంది. కోస్తాలో మరింత పెరిగింది. ఇక తెలంగాణలో కూడా చలి తీవ్రత పెరిగిపోతుంది.
రానున్న మూడు రోజులు పాటు జాగ్రత్త వహించాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. సింగల్ డిజిట్ ఉష్ణోగ్రత నమోదు కావటంతో రాత్రివేళ చలి తీవ్రత మరింత పెరిగింది. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వృద్ధులు, పిల్లలు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.