మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 డిశెంబరు 2024 (17:33 IST)

ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్

Rains
ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో గణనీయమైన వర్షాలు కురుస్తాయని, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఈ రోజు (మంగళవారం) మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 
 
బుధవారం నెల్లూరు, తిరుపతి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలతో సహా పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అదనంగా కృష్ణా, బాపట్ల, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
 
కోస్తా జిల్లాల్లో వరి, పత్తి, పొగాకు, ఇతర పంటలు పండించే రైతులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. రైతులు వరి కోతలను రెండు, మూడు రోజులు వాయిదా వేయాలని, నష్టపోకుండా ఉండేందుకు కోతకు వచ్చిన వరి పంటలను పొలాల్లో పేర్చుకోవాలని సూచించారు. 
 
గంటకు 35 నుండి 45 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున దక్షిణ తీరం వెంబడి ఉన్న మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది.