సోమవారం, 20 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 19 జనవరి 2025 (15:22 IST)

మను భాకర్‌ ఇంట విషాదం..రోడ్డు ప్రమాదంలో అమ్మమ్మ, మామయ్య మృతి (video)

manu baker
భారత షూటర్ మను భాకర్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. హర్యానాలోని మహేంద్రగఢ్ బైపాస్ రోడ్డులో జరిగిన ఈ ప్రమాదంలో ఆమె అమ్మమ్మ, మామ ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే మను భాకర్ అమ్మమ్మ, మామ ప్రయాణిస్తున్న బ్రెజ్జా కారు స్కూటర్‌ను ఢీకొట్టడంతో కారు బోల్తా పడింది. 
 
ఈ  ఘటనలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. ఆ కారును నడుపుతున్న డ్రైవర్ సంఘటన జరిగిన వెంటనే అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు.
 
గత సంవత్సరం పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలుచుకున్న మను భాకర్‌ను ఇటీవల భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఖేల్ రత్న అవార్డుతో సత్కరించింది. రెండు రోజుల క్రితం, ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి ఈ అవార్డును అందుకుంది. ఈ ఊహించని విషాదం ఆమె కుటుంబంలో విషాద ఛాయలను నింపింది.