శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 నవంబరు 2022 (10:53 IST)

ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న సినీ నటి రంభ

rambha
సినీ నటి రంభ రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. తన పిల్లలతో కలిసి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో రంభ కుమార్తె గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని రంభ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. 
 
కాగా, ప్రస్తుతం తన భర్త ఇంద్రన్‌తో కలిసి రంభ కెనడాలో నివాసం ఉంటుంది. అక్కడి కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. తన పిల్లలను స్కూలు నుంచి ఇంటికి తీసుకెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది.
ramba daughter
 
ఈ ఘటనలో తామంతా స్వల్ప గాయాలతో బయటపడినట్టు తెలిపింది. అయితే, చిన్న కుమార్తె సాషా మాత్రం గాయాల కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో రంభ, ఆమె పిల్లలు, ఒక ఆయా ఉన్నారు. కారులోని ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.