బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 26 మే 2022 (16:30 IST)

సూపర్ ప‌వ‌ర్స్ వున్న కేర‌క్ట‌ర్‌లో రాగిణి ద్వివేది

Ragini Dwivedi
Ragini Dwivedi
పలు భాషల్లో కథానాయికగా పేరు తెచ్చుకున్న రాగిణి ద్వివేది నటిస్తున్న కొత్త చిత్రం "సారి".. దీనికి 'కర్మ రిటర్న్స్ " ఉప శీర్షిక.  తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ బాషలలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి  బ్రహ్మ దరకత్వం వహిస్తున్నారు. కె.వి.ఎం.డి  ప్రొడక్షన్స్, కిస్ ఇంటర్నేషనల్స్ పతాకాలపై. నిర్మాత నవీన్ కుమార్ (కెనడా) నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. హైదరాబాద్ లో మూడవ షెడ్యూల్ మొదలు కానున్నది..ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన  వివరాలు తెలియ‌జేశారు.
 
 కథానాయిక రాగిణి ద్వివేది మాట్లాడుతూ,  సూపర్ హీరో  కాన్సెప్ట్ తో  తెరకెక్కుతున్న చిత్రమిది. ఇంతకుమునుపు ఎన్నడు పోషించని సూపర్ హీరో గా  ఛాలెంజింగ్ [పాత్రను చేస్తున్నాను. నటించడానికి నాకెంతో స్కోప్ ఉన్న పాత్ర మాత్రమే కాదు నన్ను మరో కొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రం. సూపర్ హీరో చిత్రమనగానే సహజంగా ఫైట్స్ ఉంటాయి. వాటిని కూడా నేను ఎంతో బాగా చేస్తున్నాను. సాంకేతిక పరంగా కూడా ఈ చిత్రానికి పెద్ద పీట వేశాం. తెలుగులో ఇదివరకు నటించినప్పటికీ, ఇతర భాషలలో చేస్తూ ఉండటంవల్ల తెలుగులో అధికంగా చిత్రాలు చేయలేకపోయాను. ఇకమీదట తెలుగు చిత్రాలకు ప్రాధాన్యమిస్తాను' అని అన్నారు. 
చిత్ర దర్శకుడు బ్రహ్మ మాట్లాడుతూ, .మూడు భాషలలో రూపొందుతున్న క్రైమ్ థ్రిల్లర్  కదా చిత్రమిది. ఇందులో సూపర్ హీరోగా రాగిణి విశ్వరూపం చూడబోతున్నారు' అని చెప్పగా, సహ నిర్మాత  జై కృపాలిని మాట్లాడుతూ, ఈ చిత్రం మూడవ షెడ్యూల్ ను జూన్ లో హైదరాబాద్ లో చేయబోతున్నట్లు తెలిపారు. 
 
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాజీవ్ గణేశన్, స గీతం: రాజు ఎమ్మిగనూరు, రచన: బోయనపల్లి రమణ, ఎడిటింగ్: నందమూరి హరి, కొరియోగ్రఫీ: ఇమ్రాన్ సర్ధారియా, .ఫైట్స్ : అల్టిమేట్ శివు,  ఫయాజ్ ఖాన్,, సహ నిర్మాత  జై కృపాలిని, నిర్మాత: నవీన్ కుమార్ (కెనడా), దర్శకత్వం: బ్రహ్మ.