శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 అక్టోబరు 2022 (19:28 IST)

సింగర్ సునీత లేటెస్ట్ వీడియో వైరల్.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. (video)

Sunitha
సింగర్ సునీతకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఈమె తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఒక వీడియో అలాగే ఫొటోస్ యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి. అడవిలో నదుల మధ్య ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ దేవకన్యల చూపరులను ఆకట్టుకుంటుంది. 
 
 


 
ఉదయాన్నే కనిపించే స్వచ్ఛమైన ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోంది. ప్రకృతి మధ్య తన సోయగాలతో.. ప్రకృతి సైతం సిగ్గుపడేలా తన అందాన్ని చూపిస్తోంది. పింక్ కలర్ అనార్కలి గౌన్‌లో దేవకన్యను తలపిస్తోంది సునీత. 
 
ప్రస్తుతం ఈ వీడియో విపరీతమైన లైక్, షేర్స్ కూడా రాబట్టింది. సునీత సినీ కెరియర్ విషయానికి వస్తే.. సినిమాలలో హీరోయిన్ అవకాశాలు వస్తున్నా.. రిజెక్ట్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ కేవలం సింగర్ గా అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తనను తాను మరింత పదిలం చేసుకుంటోంది.