ఆదివారం, 10 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 అక్టోబరు 2022 (17:12 IST)

ట్విటర్‌కు పోటీగా బ్లూ స్కై : జాక్ డోర్సే సరికొత్త యాప్

jack dorsey
ట్విటర్ మైక్రోబ్లాగింగ్ మెసేజ్ సైట్‌ను టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు విక్రయించిన తర్వాత జాక్ డోర్సే సరికొత్త యాప్‌ను ఆవిష్కరించే అంశంపై దృష్టిసారించారు. ముఖ్యంగా, ట్విట్టర్‌కు పోటీగా బ్లూస్కై పేరుతో సరికొత్త యాప్‌ను తీసుకునిరానున్నట్టు సమాచారం. 
 
ఈ కొత్త వేదికను ఇప్పటికే ప్రైయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్టు ఓ బ్లాగ్‌లో డోర్సే స్వయంగా వెల్లడించారు కూడా. ఒకసారి ఈ పరీక్ష పూర్తయితే దాన్ని పబ్లిక్ బీటా టెస్టింగ్‌ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. 
 
బ్లూస్కై అథెంటికేటెడ్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్‌పై పని చేస్తుందని డోర్సే తెలిపారు. అంటే ఒక్క సైట్ ద్వారా కాకుండా పలు సైట్ల ద్వారా నడపాల్సి ఉంటుంది. తొలుత ఈ ప్రాజెకక్టును బ్లూస్కై పేరుతో ప్రారంభించామని, చివరకు కంపెంనీ పేరు కూడా దాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలిపారు.