1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Elon Musk completes Twitter takeover, fires CEO Parag Agrawal

ముగిసిన ట్విటర్ డీల్.. పగ్గాలు చేపట్టిన ఎలాన్ మస్క్.. సీఈవోపై ఫైర్

twitter deal elon musk
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎట్టకేలకు ట్విటర్ డీల్ పూర్తి చేశారు. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను ఆయన సొంతం చేసుకున్నారు. ట్విట్టర్ తన హస్తగతం కావడంతో ఆయన ఆ సంస్థలో పని చేసే టాప్ ఎగ్జిక్యూటివ్‌లపై వేటేశారు. ఈ మేరకు యూఎస్ మీడియా గత అర్థరాత్రి దాటిన తర్వాత వార్తా కథనాలను ప్రసారం చేసింది. ఈ డీల్ సాఫీగా ముగియడంతో ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా చర్చా వేదిక ట్విటర్ ఎలాన్ మస్క్ చేతికి వచ్చింది. 
 
కాగా, ట్విటర్ కొనుగోలు విషయంలో ఈ నెల 28వ తేదీలోపు ఏదో ఒక నిర్ణయానికి రావాలంటూ గతంలో కోర్టు షరతు విధించింది. దీంతో ట్విటర్‌ డీల్‌ను ఎలాన్ మస్క్ పూర్తి చేశారు. మొత్తం 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను ఆయన కొనుగోలు చేశారు. 
 
అయితే, ట్విటర్ పగ్గాలు తన చేతికిరాగానే కార్యాచరణలోకి దిగిన ఎలాన్ మస్క్... ట్విటర్ సీఈవోగా ఉన్న పరాగ్ అగర్వాల్, సీఎఫ్ఓ నెడ్ సెగల్, లీగల్ పాలసీ హెడ్ విజయ గద్దె, ట్రస్ట్ అండ్ సేఫ్టీ హెడ్ సీన్ హెడ్గట్‌లపై వేటు వేసినట్టు వాషింగ్టన్ పోస్ట్, సీఎన్‌బీసీ టీవీ చానెల్స్ వార్తా కథనాలను ప్రసారం చేశాయి. అయితే, ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సివుంది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
తేయాకు అనుకుని.. విచికారీ మందుతో టీ తయారీ... ఐదుగురి మృతి