బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 జులై 2022 (15:44 IST)

ఎలాన్ మస్క్‌కు మధ్య అక్రమ సంబంధం.. వార్తలు వైరల్

elon musk
గూగుల్ కో ఫౌండర్, బిలియనీర్ సెర్గీ బ్రిన్ భార్య నికోల్ షనన్‌కు ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు మధ్య అక్రమ సంబంధం ఉందనే వార్తలు సంచలనం రేపుతున్నాయి. 
 
చాలా ఏళ్లుగా మస్క్, సెర్గీ బ్రిన్‌ల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అయితే తన భార్యతో మస్క్‌కు అఫైర్ ఉందనే విషయం తెలిసినప్పటి నుంచి వారి మధ్య సంబంధం బలహీనపడుతూ వచ్చింది.
 
ఈ ఏడాది జనవరిలో బ్రిన్ విడాకులకు దరఖాస్తు చేశారు. 2021 డిసెంబర్ 15 నుంచి తాను, షనన్ విడిగా ఉంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. తన కూతురుని జాయింట్ కస్టడీకి ఇవ్వాలని కోరారు.       
 
మరోవైపు, ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఓ పార్టీలో బ్రిన్‌కు మస్క్ క్షమాపణలు చెప్పినట్టు సమాచారం.  
తన గర్ల్ ఫ్రెండ్, సింగర్ గ్రిమ్స్‌తో మస్క్ విడిపోయిన కొన్ని నెలల తర్వాత మస్క్, షనన్‌ల అఫైర్ వెలుగులోకి వచ్చింది. గ్రిమ్స్‌తో మస్క్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 
 
మరో విషయం ఏమిటంటే... మస్క్‌కు సంబంధించిన మరో అఫైర్ తాజాగా బయటపడింది. తన కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న షివోన్ అనే మహిళతో ఆయనకు సంబంధం ఉంది. 2021 డిసెంబర్‌లో ఆమె కవల పిల్లలకు జన్మనిచ్చిందనే వార్తలు వచ్చాయి.