గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 2 జూన్ 2022 (12:40 IST)

వస్తే ఆఫీసుకు వచ్చి పనిచేయండి లేదంటే గెటవుట్: ఎలాన్ మస్క్ సీరియస్ వార్నింగ్

elon musk
రిమోట్‌గా పని చేస్తున్న టెస్లా ఉద్యోగులను ఆఫీసుకు తిరిగి రావాలని లేదంటే తక్షణమే ఆఫీస్ నుంచి గెటవుట్... రాజీనామా చేసి వెళ్లిపొండి అంటూ టెస్లా CEO, ఎలాన్ మస్క్ సిబ్బందిని తీవ్రంగా హెచ్చరించాడు.


కోవిడ్ మహమ్మారి చుట్టుముట్టినప్పటి నుండి సంస్థలు తమ ఉద్యోగులలో వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి రిమోట్‌గా పని చేయడానికి లేదా ఇంటి నుండి పని చేయడానికి తమ ఉద్యోగులకు ఆఫర్ ఇస్తున్నాయి.

 
పెద్ద పెద్ద టెక్ కంపెనీలు కూడా హైబ్రిడ్ వర్కింగ్ మోడల్‌ను అనుమతించాయి. ఇందులో భాగంగా ఉద్యోగులకు ఆఫీసు నుండి లేదా ఇంట్లో పని చేయడానికి వీలు కల్పిస్తూ అనుమతించడం జరిగింది. అయినప్పటికీ టెస్లా CEO ఎలోన్ మస్క్ తమ ఉద్యోగులనుద్దేశించిన ఇమెయిల్‌లో, సిబ్బందిని కార్యాలయానికి తిరిగి రావాలని లేదా "గెటవుట్" అని హెచ్చరించాడు. ఇప్పుడు ట్విట్టర్‌లో వైరల్ అయిన రెండు ఇ-మెయిల్‌ స్క్రీన్‌గ్రాబ్‌లు గోప్యంగా ఉండవలసి ఉంది. అయితే, కొంతమంది అసంతృప్త టెస్లా ఉద్యోగులు దీనిని సోషల్ మీడియాలో లీక్ చేశారు.
Letter

 
తన మొదటి ఇమెయిల్‌లో, మస్క్ ఇంటి నుండి లేదా మరెక్కడైనా పని చేయడం ఆమోదయోగ్యం కాదని, ఉద్యోగులు కార్యాలయానికి తిరిగి రావాలని ఖచ్చితంగా చెప్పాడు. అతను కార్యాలయంలో కనీసం 40 గంటలు పని చేయాలని ఉద్యోగులను ఆదేశించాడు.