సంబంధిత వార్తలు
- వంట చేయడం ఆలస్యమైందని భార్యను కొట్టి బావిలో తోసిన భర్త
- ఇంటికొస్తే చాలు... భర్తను బ్యాట్‌తో భార్య బాదుడే బాదుడు... వీడియో వైరల్, బాధితుడు కోర్టుకు...
- భర్తను వదిలేసి తనకన్నా రెండేళ్లు చిన్నవాడితో సహజీవనం, మిస్సింగ్ కేసు పెట్టిన భర్త... అంతే
- మెడికల్ విద్యార్థిని విస్మయ కేసు: భార్య మరణానికి కారకుడు భర్తేనన్న కోర్టు, శిక్ష ఖరారు
- ప్రియురాళ్లతో భర్త జల్సాలు... భార్యను గొంతుకోసేశాడు..
మ్యాగీకేసు: మూడు పూటలూ మ్యాగీనే.. విడాకులు కోరిన భర్త
Noodles
ఈ కేసును విచారించిన న్యాయమూర్తి ఎంఎల్ రఘునాథ్ దీనిని "మ్యాగీ కేసు"గా అభివర్ణించారు, మహిళ ప్రొవిజన్ స్టోర్‌కు వెళ్లి మ్యాగీని మాత్రమే కొనుగోలు చేస్తుందని.. మరే వస్తువులను వండటం కోసం కొనదని భర్త ఫిర్యాదు చేశాడు. మూడు పూటలూ మ్యాగీ మాత్రమే వడ్డిస్తుందని వాపోయాడు. ఈ జంట పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారని రఘునాథ్ తెలిపారు. ఇటీవల విడాకుల కేసులు పెరిగాయని రఘునాథ్ తెలిపారు.
అలాగే వంట చేయడం అనేది ఒక ప్రాథమిక జీవన నైపుణ్యం, దీనిని ప్రతి ఒక్కరూ తమ కోసం ఎలా చేయాలో తెలుసుకోవాలని రఘునాథ్ చెప్పారు.
కాగా ఇటీవల తన భార్య మటన్ కర్రీ వండడం లేదని ఫిర్యాదు చేయడానికి 100 సార్లు డయల్ చేసిన తెలంగాణకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇతడు కనగల్ మండలం చర్ల గౌరారం గ్రామానికి చెందిన నవీన్ అని తేలింది. ఇతడు మద్యం మత్తులో ఆ పని చేశాడని తేలింది.
