1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. YSRCP MLC Duvvada Srinivas Warns to Atchennaidu

'అంకుశం' చిత్రంలో రామిరెడ్డికి పట్టిన గతే - అచ్చెన్నాయుడికి వైకాపా ఎమ్మెల్సీ వార్నింగ్

duvvada srinivas
తెలుగుదేశం పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. అంకుశం చిత్రంలో విలన్ రామిరెడ్డిని కొట్టుకుంటూ నడిరోడ్డుపై తీసుకెళ్లినట్టుగా తీసుకెళ్తానంటూ హెచ్చరించారు. 
 
ఒంగోలులో జరిగిన టీడీపీ మహానాడులో సీఎం జగన్‌పై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తీవ్రస్థాయిలో స్పందించారు. 
 
జగన్ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని, తాట తీస్తానని హెచ్చరించారు. అంతేకాదు అంకుశం సినిమాలో విలన్ రామిరెడ్డిని కొట్టినట్టు కొడుతూ రోడ్డుపై తీసుకెళతామని ఘాటుగా హెచ్చరించారు. రాజకీయంగా అచ్చెన్నాయుడు అంతు చూస్తామని, ఇదే తన ఆశయమని దువ్వాడ శ్రీనివాస్ శపథం చేశారు. 
 
సీఎం జగన్ కోసం ఏమైనా చేస్తానని, చివరకు ఆత్మాహుతి దళంగా కూడా మారేందుకు సిద్ధమని ప్రకటించారు. జీవితం మీద, ప్రాణం మీద ఆశలేని వ్యక్తినని, టీడీపీ నేతలు ఈ విషయాన్ని గమనించి నోటిని అదుపులో ఉంచుకోవాలని ఆయన హెచ్చరించారు. 
తర్వాతి కథనం
సివిల్స్ 2021 ఫలితాలను వెల్లడి - తెలుగు అభ్యర్థులకు ర్యాంకుల పంట