గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 25 మే 2022 (22:08 IST)

ఇంటికొస్తే చాలు... భర్తను బ్యాట్‌తో భార్య బాదుడే బాదుడు... వీడియో వైరల్, బాధితుడు కోర్టుకు...

wife beating husband
మహిళలపై జరిగే అఘాయిత్యాలు, దాడులు ఎక్కువ కనబడుతుంటాయి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఇంటికి వస్తే చాలు... భర్తను బ్యాటుతో పిచ్చకొట్టుడు కొడుతోంది భార్య. దీనికి కారణం ఏంటన్నది వెలికి రాలేదు కానీ... భర్త ఇంటికి వస్తే చాలు... ఆమె బ్యాటుతోనో, అప్పడాల కర్రతోనే ఉతికేస్తుంది. ఆమె నుంచి తప్పించుకోవడానికి అతడు నానా తంటాలు పడుతున్నాడు. చివరికి కోర్టు మెట్లెక్కాడు.

 
పూర్తి వివరాలు చూస్తే... రాజస్థాన్ రాష్ట్రంలో వుంటున్న అజిత్ సింగ్ యాదవ్ ఓ కళాశాలకు ప్రిన్సిపాల్. ఇతడు ఏడేళ్ల క్రితం సుమన్ అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు వారి కాపురం సజావుగానే సాగింది. కానీ ఏమయిందో తెలియదు... గత కొన్ని నెలలుగా భార్య ప్రవర్తనలో మార్పు వచ్చింది.


భర్తను బ్యాటుతో ఉతికేస్తుంది. ఆమె నుంచి రక్షణ కావాలని భర్త కోర్టును ఆశ్రయించాడు. కోర్టుకు సాక్ష్యం చూపించడానికి గాను ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసాడు. వాటి ఫుటేజీలను సమర్పించాడు. వాటిని పరిశీలించిన కోర్టు... బాధితుడికి రక్షణ కల్పించాలని ఆదేశించింది.