గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 మే 2022 (16:20 IST)

జైపూర్ హైవేలో రోడ్డు ప్రమాదం.. గంగానదిలో అస్థికలను కలిపి తిరిగి వస్తుండగా..?

Accident
Accident
ఢిల్లీ-జైపూర్ హైవేలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, ఏడుగురు గాయాలపాలైనారు. ఢిల్లీ-జైపూర్ హైవేపై వేగంగా వెళ్తున్న క్రూయిజర్ ఆగి వున్న ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. 
 
మరణించిన వారు ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు వున్నారు. హరిద్వార్ నుండి జైపూర్‌కు వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది.
 
తండ్రి అస్థికలను హరిద్వార్ వద్ద గంగానదిలో నిమజ్జనం చేసిన తరువాత రామ్ తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని రేవారీ పోలీసులు చెప్పారు. 
 
మృతులను సమౌడ్ గ్రామానికి చెందిన మల్లు రామ్, మహేందర్ కుమార్, సుగ్నా, ఆశిష్, భోరి దేవిగా గుర్తించారు. క్షతగాత్రులను రేవారి జిల్లాలోని బావల్ పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చేర్చినట్లు పోలీసులు తెలిపారు.