నారాయణ అల్లుడు - కుమార్తెలను అరెస్టు చేయొద్దు : ఏపీ హైకోర్టు
ఏపీలో ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నారాయణ విద్యా సంస్థల అధినేత పి.నారాయణ అల్లుడు, కుమార్తెలను తొందరపడి అరెస్టు చేయొద్దని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నెల 18వ తేదీ వరకు వారిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని జస్టిస్ మన్మథరావు ఆదేశాలు జారీచేశారు. అలాగే, వారికి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
కాగా, ప్రశ్నం లీకేజీ కేసులో నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయగా ఆయనకు ఆ రోజే చిత్తూరు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఇదే కేసులో తమను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని భావించిన జాలిపర్తి కొండలరావు, మాలెంపాటి కోశోర్, రాపూరు వెంకటేశ్వర రావు, ఎ.మునిశంర్, బి.కోటేశ్వర రావు తదితరులు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ నెల 18వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఆదేశాలు జారీచేసింది.