బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 మే 2022 (11:56 IST)

అత్యాచారణ ఆరోపణలు - రాజస్థాన్ మంత్రి తనయుడికి సమన్లు

delhi high court
రాజస్థాన్ రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మహేష్ జోషి కుమారుడు రోహిత్ జోషికి ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీచేసింది. యువతిపై అత్యాచారం చేసినట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. ఈ నోటీసుల్లో ఈ నెల 18వ తేదీన కోర్టులో హాజరుకావాలని పేర్కొన్నారు. 
 
కాగా, పెళ్ళిచేసుకుంటానని నమ్మించి జనవరి 8వ తేదీ నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు పలుమార్లు అత్యాచారం జరిపినట్టు జైపూర్‌కు చెందిన 23 యేళ్ళ యువతి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పైగా, ఈ ఫిర్యాదు చేయడంతో తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని అందువల్ల తనకు రక్షణ కల్పించాలని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 
 
ఈ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో విచారణ, అరెస్టు చేసేందుకు ఢిల్లీ పోలీసులు జైపూర్‌కు వెళ్లగా రోహిత్ జోషి అందుబాటులో లేకపోవడం లేదా మొబైల్ ఫోన్ స్విచాఫ్ చేయడం వంటి సంఘటనలు జరిగాయి. ఇదే విషయాన్ని కోర్టుకు తెలుపగా, సమన్లు జారీ చేసింది. వీటిని ఆయన ఇంటికి అతికించాలని ఆదేశించింది.