శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 మే 2022 (19:07 IST)

మేనమామ భార్యతో వివాహేతర సంబంధం.. చివరికి ఇద్దరి ప్రాణాలు?

crime scene
మేనమామ భార్యతో అక్రమ సంబంధం ఆ యువకుడి ఇద్దరు ప్రాణాలు పోయేందుకు కారణమైంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని బికనీర్‌ ప్రాంతానికి చెందిన కుశలరామ్ అనే యువకుడికి అతడి మేనమామ ఉద్రమ్ భార్య గౌరా దేవితో వివాహేతర సంబంధం ఏర్పడింది. కొన్నాళ్లకు విషయం వెలుగులోకి వచ్చింది. 
 
అంతే తన మేనల్లుడిని హత్య చేయాలనుకున్నాడు. పక్కా ప్లాన్ ప్రకారం మేనల్లుడిని హత్య చేశాడు. మృతదేహాన్ని ఒంటెపై వేసి, ఊరి బయటకు తరలించి అక్కడ పారేశాడు. సోమవారం కుశలరామ్ మృతదేహాన్ని గమనించిన గ్రామస్తులు విషయాన్ని పోలీసులకు చేర వేశారు. 
 
పోలీసులు ఉద్రమ్‌ను గట్టిగా ప్రశ్నించే సరికి అతడు నేరం అంగీకరించాడు. ఇక తమ విషయం బయటపడడం, కుశలరామ్ హత్యకు గురి కావడంతో గౌరా దేవి భయపడింది. సోమవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. వారిద్దరి మధ్య ఏర్పడిన అనైతిక సంబంధం వారిద్దరి ప్రాణాలను బలి తీసుకుంది.