ఆదివారం, 3 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 జులై 2022 (13:05 IST)

భారత మార్కెట్‌లోకి గూగుల్ 6ఏ కొత్త ఫోన్

Google
భారతీయ స్మార్ట్ మార్కెట్‌లోకి గూగుల్ మరో కొత్త మోడల్ స్మార్ట్ ఫోనును ప్రవేశపెట్టనుంది. గూగుల్ పిక్సెల్ 6ఏ పేరుతో ఈ ఫోనును తీసుకునిరానుంది. అయితే, ఈ ఫోను లాంఛింగ్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ ఈ నెలాఖరులోగా ఈ ఫోనును భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఈ ఫోన్ ఫీచర్లను పరిశీలిస్తే, గూగుల్ సొంత ప్రాసెసర్ టెన్సార్‌పై ఇది పని చేస్తుంది. 60 హెచ్‌జడ్‌తో కూడిన 6.1 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే అందించారు. అలాగే, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో తీసుకునిరానుంది. 
 
ఇందులో 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసేలా 4410 ఎంఏహెచ్‌ బ్యాటరీని అమర్చారు. అలాగే, ఇందులో అమర్చిన కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
 
ఫోను వెనుకాల 12 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటాయి సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. దీని ధర రూ.37,000గా ఉండొచ్చి భావిస్తున్నారు.