శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 11 నవంబరు 2022 (17:39 IST)

కార్తీక్ రాజు, త్వరిత నగర్ జంటగా లాంఛనంగా ప్రారంభమైన చిత్రం

Karthik Raju, tyarita Nagar, ravi and others
Karthik Raju, tyarita Nagar, ravi and others
కార్తీక్ రాజు, త్వరిత నగర్ హీరో హీరోయిన్లుగా దండమూడి బాక్సాఫీస్, సాయి స్ర‌వంతి మూవీస్ ప్రొడక్షన్ నెం. 2 శుక్ర‌వారం లాంఛ‌నంగా ప్రారంభమైంది. అంజీ రామ్ ద‌ర్శ‌క‌త్వంలో దండమూడి అవనింద్ర కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి నిర్మాత దండమూడి అవనింద్ర కుమార్ క్లాప్ కొట్టారు. ప్ర‌ముఖ సింగ‌ర్ మ‌నో కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఆకాష్ పూరి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత భాస్క‌ర భ‌ట్ల స్క్రిప్ట్‌ను అందించారు.

ఈ సంద‌ర్భంగా దండమూడి బాక్సాఫీస్ బ్యాన‌ర్ అధినేత ..నిర్మాత దండ‌మూరి అర‌వింద్ కుమార్ మాట్లాడుతూ ‘‘ దండ‌మూడి బాక్సాఫీస్ ప్రొడ‌క్ష‌న్ నెం.2 పూజా కార్యక్రమాలు జరిగాయి. సినిమాను ప్రారంభించాం. ఈ సినిమాను హైద‌రాబాద్‌, బ్యాంకాక్, పుకెట్ స‌హా ప‌లు ప్రాంతాల్లో చిత్రీక‌రించ‌టానికి స‌న్నాహాలు చేశాం. 35-40 రోజుల్లో మూవీ షూటింగ్‌ను పూర్తి చేయాల‌నేది మా ప్లాన్‌. అంద‌రూ మా యూనిట్‌ను ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాం’’ అన్నారు.
 
సాయి స్ర‌వంతి మూవీస్ అధినేత ..ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ గొట్టిపాటి సాయి మాట్లాడుతూ ‘‘మా సినిమా ఈరోజు పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. సినిమాను హైద‌రాబాద్, బ్యాంకాక్‌, పుకెట్ ప్రాంతాల్లో సింగిల్ షెడ్యూల్‌లో చిత్రీక‌రించేలా స‌న్నాహాలు చేసుకున్నాం. కార్తీక్ రాజు, త్వ‌రిత హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌ధాన తారాగ‌ణం ఇంకా చాలా మంది ఉన్నారు. వీలైనంత త్వ‌ర‌గా సినిమాను పూర్తి చేసి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌చ్చేలా ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.
 
హీరో కార్తీక్ రాజు మాట్లాడుతూ ‘‘దండ‌మూడి బాక్సాఫీస్ ప్రొడ‌క్ష‌న్‌లో మూవీ చేస్తున్నాను. ఈరోజునే ప్రారంభ‌మైంది. నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతున్న ల‌వ్‌, యాక్ష‌న్‌, క్రైమ్ డ్రామా. అనుదీప్ దేవ్ సంగీతాన్ని అందిస్తున్నారు. కొత్త‌గా ఉంటుంది. డిఫరెంట్ స్క్రిప్ట్ అని క‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ను. మంచి టీమ్ కుదిరింది. మంచి సినిమాతో మీ ముందుకు వ‌స్తాం’’ అన్నారు.
 
హీరోయిన్ త్వ‌రిత న‌గ‌ర్ మాట్లాడుతూ ‘‘దండమూడి బాక్సాఫీస్ బ్యానర్‌లో హీరోయిన్‌గా న‌టించ‌టం చాలా హ్యాపీగా ఉంది. అమేజింగ్ స్క్రిప్ట్‌. నా కోస్టార్ కార్తీక్ రాజుతో క‌లిసి న‌టించ‌టం హ్యాపీ’’ అన్నారు.
 
దర్శకుడు అంజీ రామ్ మాట్లాడుతూ ‘‘దండమూడి బాక్సాఫీస్ ప్రొడక్షన్ ద్వారా డైరెక్టర్ కావటం సంతోషంగా ఉంది. గొట్టిపాటి సాయిగారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, దండమూడి అవనింద్ర కుమార్ నిర్మాత‌గా సినిమా చేస్తున్నారు. మంచి నిర్మాల‌తో క‌లిసి ప‌ని చేయబోతున్నందుకు గ‌ర్వంగా ఉంది. ఈ బ్యాన‌ర్‌కు మంచి పేరు తెచ్చేలా సినిమా చేస్తాం. దండ‌మూడి అంటే ఓ బ్రాండ్‌. దాన్ని నిల‌బెట్టేలా మా వంతు ప్ర‌య‌త్నం చేస్తాం.సాయిగారు, కుమార్‌గారి ప్రొడ‌క్ష‌న్‌లో సినిమా చేయ‌టం అదృష్టంగా భావిస్తున్నాను. పూజా కార్య‌క్ర‌మాల‌తో సినిమా ఈరోజు లాంఛ‌నంగా ప్రారంభమైంది. ప్ర‌స్తుతం స‌మాజంలో జ‌రుగుతున్న సోష‌ల్ క్రైమ్ ఇష్యూస్ ఆధారంగా రాసుకున్న క‌థ‌. స్క్రిప్ట్ అద్బుతంగా కుదిరింది.  న‌వంబ‌ర్ 14 నుంచి సింగిల్ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేయాల‌నేది ప్లాన్‌. హీరో కార్తీక్ రాజు, హీరోయిన్ త్వ‌రిత స‌హా మంచి టీమ్ కుదిరింది’’ అన్నారు.