నాకు వ్యక్తిగత జీవితం ముఖ్యం : లావణ్య త్రిపాఠి
నటిగా ఎ1 ఎక్స్‌ప్రెస్ తో గుర్తింపు పొందిన లావణ్య త్రిపాఠి సోగ్గాడే చిన్నినాయనా, ఉన్నది ఒకటే జిందగీ వంటి వైవిధ్య భరిత కథాంశాల్లో మరింత పేరు తెచ్చుకుంది. సోషల్ మీడియాకు దగ్గరగా ఉండే లావణ్య త్రిపాఠి ఇటీవల దూరంగా ఉంది. అందుకు కారణం తనకంటూ వ్యక్తి గత జీవితం ఉందని తెలియ జేస్తున్నది. ఇదే విషయాన్ని ఆమె తెలియజేస్తూ,, ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేయడమే పని కాదు. నిజ జీవితాన్ని గడపడం చాలా ముఖ్యం. నా వృత్తిలో భాగంగా ఇప్పుడు నేను రెండింటి మధ్య సమతుల్యతను పాటించడం నేర్చుకున్నాను అంటూ ఫ్రాంక్ గా మనసులోని మాట తెలియ జేస్తున్నది. తను ఇప్పుడు నటనలో స్పీడ్ పెంచింది.
తాజాగా తమిళంలో హీరో అథర్వ తో నటిస్తున్న సినిమా రెండు పాటలు మినహా పూర్తి అయింది. మరోవైపు జీ 5 పులి మేక థ్రిల్లర్ వెబ్ సిరీస్ కొనా వెంకట్ దర్శకత్వంలో షూటింగ్ పూర్తి అయి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇంకా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్ గా మంజునాథ దర్శకత్వంలో సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రంలో లావణ్య నటిస్తున్నది. ఇవి కాక ఒక తమిళ్ సినిమా ఒక తెలుగు సినిమా ఒక తెలుగు వెబ్ సిరీస్ ఇలా వైవిధ్యంగా ముందుకెళ్తున్న లావణ్య త్రిపాఠి త్వరలోనే రెండు ప్రాజెక్టులు అనౌన్స్ చేయనున్నారు.