శనివారం, 9 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 29 జూన్ 2022 (18:22 IST)

జ‌నాలు థియేట‌ర్ల‌కు ఎందుకు రావ‌డంలేదో చెప్పేసిన రాజ‌మౌళి

Rajamouli
Rajamouli
పాన్ ఇండియా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ప్రస్తుతం థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు ఎందుకు రావ‌డంలేదో వివరించారు. ఆయ‌న లావ‌ణ్య త్రిపాఠి న‌టించిన `హ్యాపీ బ‌ర్త్‌డే` ప్ర‌మోష‌న్‌లో భాగంగా బుధ‌వారంనాడు మియాపూర్‌లోని ఎ.ఎం.బిమాల్‌లో జ‌రిగిన ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ‌లో పాల్గొన్నారు. ట్రైల‌ర్ చాలా బాగుంద‌నీ ప్ర‌శంసిస్తూ, ద‌ర్శ‌కుడు రితేష్ రానాను అభినందించారు. అంత‌కుముందు మ‌త్తువ‌ద‌ల‌రా చిత్రం ఆయ‌న చేశారు.
 
ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళి మాట్లాడుతూ, ఇది స‌రియ‌ల్ కామెడీ అనే కొత్త కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌కుడు చిత్రాన్ని తీశారు. అయితే ఈమ‌ధ్య జ‌నాలు థియేట‌ర్ల‌కు రావ‌డంలేదు. ఎందుకంటే, ఏది జేసినా ఫుల్ ప్లెడ్జ్ గా చేయాలి. కామెడీ ఫుల్ జోష్‌తో తీయాలి. ఇర‌గ‌బ‌డి న‌వ్వేట్లు వుండాలి. ఫైట్స్ కూడా ఇర‌గ‌తీయాలి. అలా అయితేనే జ‌నాలు వ‌స్తారు. హాఫ్ హాటెడ్‌గా తీస్తే జ‌నాలు రావ‌డం లేదు. ఇది నా విశ్లేష‌ణ అంటూ తెలిపారు.